అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో నల్లధనం మరింద పేరిగిందని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న అక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకస్తోందని ఆరోపించారు. అన్ని విషయాలో సామాన్య ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. నీలం తుపాను నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాల వూసే ఎత్తడం లేదని ఆయన అన్నారు.



