అఖిలపక్షంలో అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలిపాలి: శైలజానాధ్
హైదరాబాద్: అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర్లంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలిపాల్సిన అవసరం ఉందని మంత్రి శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. తనను అఖిలపక్ష సమావేశానికి పంపమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరతానని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలవడం సంతోషకరమని, గుజరాత్‌లోనూ కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరు కనబరచిందన్నారు.