అఖిలపక్షంలో అభిప్రాయం చెప్పాలని నిలదీస్తాం : యనమల
అఖిలపక్షానికి యనమల, శ్రీహరి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పొత్కపల్లిలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. అఖిలపక్ష సమావేశాంలో అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. అఖిల పక్షం ముగిసిన తర్వాత కేంద్రం తన అభిప్రాయం చెప్పాలన్నారు. అఖిలపక్ష సమావేశానికి తెదేపా తరపున యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి హాజరవనున్నారు. సమావేశాంలో లేఖ ద్వారా తమ అభిప్రాయం చెప్తామని, సమావేశం తర్వాత లేఖను మీడియా ముందు ఉంచుతామని యనమల తెలియజేశారు.