అగ్నిప్రమాద ఘటనపై పుప్పాలగూడలో కేసు నమోదు

హైదరాబాద్‌: నగర శివారులోని పుష్పాలగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై లోకాయుక్త స్పందించింది. శ్రీరాంనగర్‌ కాలనీలో సినిమా ఘాటింగ్‌కు సంబంధించిన పరికరాలు, దుస్తులు ఉంచిన షెడ్డు నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌కు వ్యాపించి ఏడుగురు మరణించిన సంగతి విదితమే. ప్రమాదంలో ఘాటింగ్‌ యూనిట్‌ నిర్లక్ష్యం కన్పిస్తోందని ఈ సందర్భంగా లోకాయుక్త అభిప్రాయపడింది. దీనిపై ఎలావటి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు ఎటువంటి సహాయం అందించారు, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో తెలపాలని లోకాయుక్త పేర్కొంది. ఘటనను సుమోటోగా స్వీకరించిన లోకాయుక్త అగ్నిమాపక శాఖ డీజీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు ఈ నెల 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.