అజర హాస్పిటల్ లో బతుకమ్మ వేడుకలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అజర హాస్పిటల్ లో బుధవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మను తొమ్మిది రోజులు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న క్రమంలో అజర హాస్పిటల్ లో పనిచేస్తున్న మహిళ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదా యాలను ప్రపంచానికి తెలిసేలా వేడుకలు నిర్వహించారు. ప్రతి ఏటా ఇలాగే బతుకమ్మ వేడుకలను హాస్పిటల్లో నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది