అటవీ అమరవీరులకు నివాళులు
అటవీ అమర వీరుల దినోత్సవం లో ర్యాలీ
అశ్వరావుపేట సెప్టెంబర్ 11( జనం సాక్షి )జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం అశ్వరావుపేట పట్టణంలో అటవీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అటవీ అమరవీరుల ను స్మరించుకుంటూ అశ్వారావుపేట అటవీ క్షేత్ర సిబ్బంది అటవీ క్షేత్రాధికారి కార్యాలయం లొ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది.బైక్ ర్యాలీ గా అటవీ క్షేత్రాధికారి కార్యాలయం నుంచి అశ్వారావుపేట రింగ్ రోడ్ వరకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమం నందు అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రెహమాన్ అశ్వారావుపేట, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ రమేష్, అరుణ్, భద్రు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు