అదనపు కట్నంకోసం భార్యను చంపిన భర్త

భీమదేవరపల్లి( జనంసాక్షి):
అదనపు కట్నంకోసం మధుసూదన్‌ అనే వ్యక్తి తన భార్యను శోభారాణి(36)ను హతమార్చిన సంఘటన గట్లనర్సిగాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎర్రల కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం గట్లనర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన బొల్లంపల్లి మధుసూదన్‌ అనే వ్యక్తి తన భార్యను అదనపు కట్నం తీసుకురావాలని చిత్రహింసలు పెట్టాడని మరియు ఈ కట్నం తేవమని బొల్లంపల్లి మొగిళి, కిరణ్‌, కిషోర్‌, చరణ్‌, ఎర్రల అరుణ,సంధ్య వీరు అదనపు కట్నం తేవాలని మధుసూదన్‌ను ప్రోత్సహించారని శోభారిని కుటుంభసబ్యులు తెలిపారు. శోభారానిని 30వేల రూపాలయల కట్నం ఇచ్చి ఎల్కతుర్తి మండలంనుంచి గట్లనర్సింగాపూర్‌ గ్రామంలోని మధుసూదన్‌ ఇచ్చి వివాహం జరిపించారు. అతను 50వేల రూపాలయల అదనపు కట్నం కోసం భార్య శోభారాణిని గుతుప కర్రతో తలపై కొట్టగా స్థానికులు 108 వాహనం ద్వార వరంగల్‌ ఎంజీఎం తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కుమారులు న్నారు.కాగా శోభారాణి అన్న చీలుముల మొండయ్య ఫిర్యాధు మేరకు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.