అదనపు గ్యాస్‌, విద్యుత్తు కోసం కేంద్రాన్ని కోరతాం: పొన్నాల

హైదరాబాద్‌: రాష్ట్రానికి అదనంగా గ్యాస్‌, విద్యుత్తు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మంగళవారం కేంద్ర మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే నేతృత్వంలో జరిగే విధ్యుత్తుశాఖా మంత్రుల సమావేశానికి రాష్ట్రం తరపున తాను హజరుకానున్నట్లు ఆయన చెప్పారు. తాత్కాలిక ఇబ్బందులతో పాటు శాశ్వత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఉంచుతామని పొన్నాల చెప్పారు.