అధికారులు లక్ష్యాలను సాధించాలి

share on facebook


కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌
కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి) : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీనిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరిలోగా సాధించాలని కామారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డీపీఎం, ఏపీఎం, వ్యవసాయ శాఖ ఏడీ, ఏఓ ఏఈఓ, స్త్రీనిధి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీనిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను మండలాల వారీగా సవిూక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాన్సువాడ, పెదకొడప్‌గల్‌ మండలాలు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, మెప్మా రుణాల్లో మంచి ప్రగతి సాధించినందుకు అధికారులను అభినందించారు. నస్రుల్లాబాద్‌, మాచారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, కామారెడ్డి మండలాలు లక్ష్యాల్లో వెనుకబడి ఉన్నాయంటూ.. 55 శాతం లక్ష్యాయలను ఖచ్చితంగా సాధించాలని, 55 శాతం సాధించిన వారు ఈనెల 31వతేలోగా 60 శాతం సాధించాలని ఆదేశించారు. మెప్మా రుణాల్లో 60 శాతం సాధించామని, ఈ నెల చివరిలోగా 65 శాతం సాధించాలని తెలిపారు. స్త్రీనిధి రుణాల గురించి మాట్లాడుతూ మదునూర్‌ మండలం 18 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించిందని, అసిస్టెంట్‌ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమకొండ మండలం కూడా 22 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించిందని తెలియచేస్తూ ఈ నెలాఖరు వరకు 40 శాతం సాధించాలని, 30 శాతం సాధించిన మండలాలు ఈ నెలాఖరు వరకు 50 శాతం సాధించాలని ఆదేశించారు. స్త్రీనిధి రుణాల కింద లబ్ధిదారులకు గేదెలు అందించడంలో ఒక యూనిట్‌ కింద రూ.93,270లతో ఒక గేదె అందిస్తున్నామని, జిల్లాకు 2,500 యూనిట్ల లక్ష్యానికిగాను 1,700 యూనిట్లకు లబ్ధిదారులను గుర్తించామని, ఈ నెల 31వ తేదీలోగా మిగిలిన లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు. మహిళా సమాఖ్యలు తమకు ఆదాయాన్ని అందించే కుటీర పరిశ్రమలపై అవగాహన పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటే పిండి మిల్లు, ఆయిల్‌ మిల్లు, కిరాణా దుకాణాలు, పప్పుమిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి లబ్ధిదారులను గుర్తించాలని, వారికి అందించే పరిశ్రమలకు గ్రామాల్లో క్వాలిటీ ఆహార వస్తువుల మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించాలని, ప్రభుత్వ గురుకుల స్కూల్స్‌, వసతిగహాలకు అవసరమైన వాటిని పంపిణీ చేసేలా పరిస్థితులను అధ్యయనం చేయాలని, మండల సమాఖ్య, గ్రామ సంఘాలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంట రుణాలకు సంబంధించి ఈనెల చివరిలోగా 80 శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. బీర్కూర్‌ 70 శాతం సాధించిందని అభినందించారు. బాన్సువాడ 55 శాతం మాత్రమే సాధించిందని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో కషిచేసి సాధించాలని ఆదేశించారు. రైతు బీమాలో మిగిలిన అకౌంట్స్‌ ఈరోజులోగా పూర్తి చేయాలని తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, ఇప్పటివరకు ఎరువుల పంపిణీ బాగుందని,
ఇప్పటి వరకు 46,978 మెట్రిక్‌ టన్నులు సప్లయ్‌ చేసామని, 5,242 మెట్రిక్‌ టన్నుల ఎరువు అందుబాటులో ఉందని, కత్రిమ కొరత లేకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్‌ డి.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా లీడ్‌ అధికారి రాజేందర్‌ రెడ్డి, మెప్మా శ్రీధర్‌ రెడ్డి, స్త్రీనిధి ఏజీఎం రవికుమార్‌, డీపీఏం రమేష్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.