‘అధికార్‌ యాత్ర’ ప్రారంభిస్తున్న నితీశ్‌ కుమార్‌

సీతామర్హి: కేంద్రంలోని రాజకీయ పరిణామాల నేపధ్యంలో బీహర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చిన బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచే కార్యక్రమం చేపట్టారు. అధికార్‌ యాత్ర పేరుతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోను ఈరోజు ప్రారంభిస్తున్నారు. బీహార్‌కి చెందిన 40 మంది ఎంపీలు లేకుండా కేంద్ర ప్రభుత్వం రూపొందదన్న విషయం గుర్తుపెట్టుకో వాలి అంటూ నితీశ్‌ తరచూ గుర్తు చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా లభిస్తే బీ హార్‌ ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అంటున్నారు.