అన్నదాతకు అండగా రుణమాఫీ

share on facebook

సిద్దిపేట,ఆగస్ట్‌16(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నదాతకు అండగా నిలుస్తోందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. రైతులకు రునమాఫీ చేపట్టడం హర్షణీయమని అన్నారు. ఇప్పటికే పెట్టుబడి సాయం రైతుబంధు అందించినా, రునమాఫీకూడా అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు పంట పెట్టుబడుల కోసం సీజన్‌కు ఎకరాకు రూ.5వేల చొప్పున అందించే సర్కారు దేశంలో మరే రాష్ట్రం లేదన్నారు. రైతుల రక్షణకు భద్రతను కల్పిస్తూ రూ.5 లక్షల బీమాను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణలోని కేసీఆర్‌ సర్కార్‌ రైతులు, అన్ని వర్గాల ప్రభుత్వమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దళిత సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Other News

Comments are closed.