అన్నా చెలెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్
డా. సత్యం శ్రీరంగం
కూకట్ పల్లి జనంసాక్షి
రాఖి పౌర్ణమి రక్షా బంధన్ సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ నాయకురాలు టిపిసిసి అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం కార్యాలయంలో కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. బాలానగర్ లో రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి పుష్ప రెడ్డి నివాసంలో టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ రక్త సంబంధం ఉన్న లేకున్నా అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని, అనురాగాన్ని పంచే పండుగ, ఎల్లలు ఎరుగని అనురాగం, ఆప్యాయతలు, వాత్సల్యం కలకలం ఉండాలని సోదరుడి రక్త సంబంధాన్ని రక్షా బంధనంతో ముడి వేసి కోరుకుంటుంది సోదరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, స్వరూప, జ్యోతి, రజిత, సంధ్య, శోభ, మట్టే ప్రసన్న కుమార్, పులి కిరణ్ గౌడ్, హేమంత్, అస్లం, అరుణ్, శేఖర్ గజానంద్, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
