అభివృద్ధికి దూరంగా శివారు గ్రామాలు

విజయనగరం, ఆగస్టు 3 : గుర్ల మండలంలోని శివారు గ్రామలు మౌలిక సదుపాయలు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. మేటర్‌ పంచాయతీలకు శివారు గ్రామాలుగా ఉన్న కొన్ని గ్రామాలకు ఇప్పటికీ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఈ గ్రామల గురించి పట్టించుకునే నాధుడే లేడు. నాతవలస శివారు గ్రామైన నక్కలపేట వాసులు ఇప్పటికే పూరిగుడిసెల్లోనే జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు అయిన నిర్మించుకొనే స్థితిలో లేక పూడి గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. సీసీ రోడ్లు, కాలవలు, విద్య వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఇప్పటికైనా మధుర గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.