మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు
` జాగతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారనందునే ఈ నిర్ణయం
` కానీ మద్దతు కోరినా ఇస్తాం
` ఫోన్ ట్యాపింగ్ తుదిదశకు చేరుతుందన్న నమ్మకం లేదు
` మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్(జనంసాక్షి):జాగతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని.. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు మద్దతు కోరినా ఇస్తామని కవిత తెలిపారు. అవసరమైన చోట తనతో పాటు జాగతి నేతలు ప్రచారం చేస్తారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుదిదశకు చేరుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పారు. కావాలనే హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్తీ, గుంట నక్క కలిసే ఉన్నారంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఎందుకు విచారణ చేపట్టారని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పట్లో తుది దశకు చేరుతుందని తాను అనుకోవడంలేదని ఆమె చెప్పారు. విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందని భావించటంలేదని కవిత అన్నారు. పొలిటికల్ పవర్ బలహీన వర్గాలకు వచ్చినప్ప్పుడే ఆ సమాజం బాగుపడుతుందన్నారు. చాలామంది ఎన్నికల్లో పోటీచేస్తామని అడుగుతున్నారని.. కానీ జాగతి పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాలేదని వెల్లడించారు. యువత, మహిళలు ఎక్కడ పోటీచేసినా జాగతి మద్దతిస్తుందని ఆమె స్పష్టం చేశారు. బీఆరఎస్, కాంగ్రెస్ నేతలు బీసీలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం వాటా ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలకు వెళుతోందని విమర్శించారు. జిల్లాల పునర్విభజన ఎప్ప్పుడు జరిగినా సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. పీవీ.నరసింహారావు పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టాలని కూడా కవిత కోరారు.కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు, యువతకు నష్టం జరిగిందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు శాతం ఓపెన్ కోటాను నాన్ లోకల్‌గా మార్చడంతో రాష్ట్ర యువతకు నష్టం జరుగుతోందని తెలిపారు. జాగతి తరఫున అధ్యయనం చేస్తున్నామని.. జిల్లాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తే నివేదిక ఇస్తామని తెలిపారు. కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు వేగంగా జరుగుతోందని.. జీహెచఎంసీ ఎన్నికల నాటికి పక్రియ పూర్తవుతుందో లేదో చూడాలని కవిత అన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద కూడా అడ్డంకులు సష్టించే అవకాశం లేకపోలేదని తెలిపారు. పార్టీకి ఇంకా ఏ పేరు అనుకోలేదని.. తెలంగాణ రాష్ట్ర జాగతి సమితి అని కొందరు సూచించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అంశానికి కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు లేదని అన్నారు. నైని బొగ్గు గని అంశం కంటే సింగరేణికి కొత్త బొగ్గు గనులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ విధానం ఎప్పటి నుంచో ఉందని.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన నిబంధనగా పెట్టారని.. కొంత మందికి మాత్రమే సెలెక్టివ్‌గా ఇస్తున్నారని తెలిపారు. విచారణ చేయించాల్సిన కాంగ్రెస్ నేతలు లేఖ రాయాలని కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. జాగతి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2014 నుంచి సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు.గతంలో సర్పంచ్‌లను కలవని వారు ఇప్ప్పుడు వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారని.. ఇది సంతోషించదగ్గ విషయమన్నారు . దాంతో సామాజిక తెలంగాణ వైపు కొంత మేర అడుగులు పడుతున్నాయని చెప్ప్పుకొచ్చారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారన్న అంశం గురించి తనకు తెలీదని, తాను ఇప్ప్పుడు బీఆరఎస్‌లో లేనని స్పష్టం చేశారు. జీహెచఎంసీ 300 డివిజన్ల ప్రతిపాదన బీఆరఎస్ హయాంలోనిదే అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కొనసాగిస్తోందన్నారు. జాగతి జనంబాట ముగింపు మార్చి పదో తేదీన అనుకుంటున్నామని.. ఆ తర్వాత బీఆరఎస్, కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ర్యాంకులు ప్రకటిస్తామని కవిత పేర్కొన్నారు.’నా టాª`గ్గంªట్ హరీశ్ రావు, ఇంకా పెద్ద టాª`గ్గంªట్ కూడా ఉంది. కేటీఆర్‌ను కూడా విమర్శించాను. బలమైన రాజకీయ భవిష్యత్ కోసం పటిష్ట ఎజెండా సిద్ధం చేసుకుంటున్నాను, ఈ దశలో నాకు నేనుగా ఎవరితోనూ మాట్లాడను. రాజకీయ కన్‌స్టలెన్సీలు ఎవరినీ నేను సంప్రదించలేదు, నన్ను సంప్రదించిన కొంత మందితో మాట్లాడాను’ అని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారులు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా తెలంగాణ జాగతి కార్యాలయంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదని విమర్శించారు. ట్యాంక్‌బండ్ విÖద ఆంధ్రావారి విగ్రహాలు తప్ప తెలంగాణ మహనీయులవి లేవని.. వాళ్ల విగ్రహాలు తొలగించాలని తాము అనటం లేదని.. అవసరం వస్తే తప్పదంటూ వ్యాఖ్యానించారామె. అమరజ్యోతిపై అవినీతి మరకలు పడ్డాయని, అందుకే దాన్ని ఓపెన్ చేయడంలేదని కవిత అన్నారు.ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలన్నారు. ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం అక్కడ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు శాతం ఓపెన్ కోటాను నాన్ లోకల్ గా మార్చడంతో రాష్ట్ర యువతకు నష్టం జరుగుతోందన్నారు. జాగతి తరఫున అధ్యయనం చేస్తున్నాం, జిల్లాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తే నివేదిక ఇస్తామన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు వేగంగా జరుగుతోందని.. జీహెచఎంసీ ఎన్నికల నాటికి పక్రియ పూర్తవుతుందో లేదో చూడాలన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద కూడా అడ్డంకులు సష్టించే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పార్టీకి ఇంకా ఏ పేరు అనుకోలేదు, తెలంగాణ రాష్ట్ర జాగతి సమితి అని కొందరు సూచించారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అంశానికి కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు లేదని.. నైనీ బొగ్గు గని అంశం కంటే సింగరేణికి కొత్త బొగ్గు గనులు వచ్చేలా చూడాలన్నారు.
బీఆరఎస్ ఆ అంశం గురించి మాట్లాడకుండా నైనీ అంశాన్ని పట్టుకొంది.. సింగరేణిలో సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ విధానం ఎప్పట్నుంచో ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన నిబంధనగా పెట్టారు, కొంత మందికి మాత్రమే సెలెక్టివ్ గా ఇస్తున్నారని కవిత అన్నారు. విచారణ చేయించాల్సిన కాంగ్రెస్ నేతలు లేఖ రాయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. జాగతి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి సమగ్ర విచారణ చేస్తామని.. అన్నారు. దాంతో సామాజిక తెలంగాణ వైపు కొంత మేర అడుగులు పడుతున్నాయని చెప్పారు.. జాగతి జనంబాట ముగింపు మార్చ్ పదో తేదీన అనుకుంటున్నాం.. ఆ తర్వాత బీఆరఎస్, కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ర్యాంకులు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తన టాª`గ్గంªట్ హరీశ్ రావు, ఇంకా పెద్ద టార్గెట్ ఉందన్నారు. కేటీఆర్ ను కూడా విమర్శించినట్లు చెప్పారు. బలమైన రాజకీయ భవిష్యత్ కోసం పటిష్ట ఎజెండా సిద్దం చేసుకుంటున్నాను, ఈ దశలో నాకు నేనుగా ఎవరితోనూ మాట్లాడనని తెలిపారు. రాజకీయ కన్‌స్టలెన్సీలు ఎవరినీ తాను సంప్రదించలేదు, నన్ను సంప్రదించిన కొంత మందితో మాట్లాడానన్నారు.


