సిట్టింగ్ జడ్జీచేత విచారణ చేయించండి
` కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం
` మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల తీర్పు
` ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణ దుర్భర పరిస్థితులకు నిదర్శనం
` ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆరఎస్ నేత కేటీఆర్
` రైతులకు రూ.25 లక్షల చొప్ప్పున ఎక్స్‌గ్రేషియా డిమాండ్
హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణిపై మంత్రులు మాట్లాడడం లేదు. సింగరేణిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.ఒక్క వైపు ఫార్ములా ఈ అంటాడు. అందులో ఫ్రూవ్ చెయ్యి.ఇక్కడ ఫార్ములా ఈపై విచారణ అంటాడు. అక్కడ దావోస్‌లో గ్రీన్ కోతో చర్చలు జరుపుతున్నారు.ఒక్క దగ్గర మంచోళ్ళు అవుతారు. మరో దగ్గర చెడ్డోళ్లు అవుతారు ఎలా..? హైద్రాబాద్ కార్పొరేషన్ ఒక్కటే ఉండే మేమేం మార్చలేదు. రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి తుగ్లక్, సమాధానం చెప్పే వరకు ఆయన వెంబడి పడుతాం అన్నారు. రేవంత్‌లో రాము ఉన్నాడు.. రెమో ఉన్నాడని కేటీఆర్ అన్నారు. ఉదాహరణకు సినిమా టికెట్లు పెంచం అంటాడు , మరోవైపు సినిమా టికెట్లు పెంచుతూ జీవో ఇస్తారు. సర్వాయి పాపన్న పేరు విÖద జనగామ జిల్లా చేస్తాం అన్నారు కానీ ఇప్ప్పుడు మళ్ళీ అదే జిల్లాను తొలగిస్తాం అన్నారు. అందుకే ఆయన రాము రెమో అని అన్నానని చెప్ప్పుకొచ్చారు కేటీఆర్.
మున్సిపల్ ఎన్నికలకు బీఆరఎస్ పార్టీ సిద్ధంగా ఉందని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాలు ఎత్తివేయటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. స్థానిక సమస్యల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తారని.. ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు చూపలేకపోయారని అన్నారు. ఫార్ములా ఈ కేసులో దోషులుగా చెప్తోన్న గ్రీన్ కోతో దావోస్‌లో రేవంత్ చర్చలు జరుపుతున్నారని అన్నారు . మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్, నేను ప్రచారం చేసేదేవిÖ ఉండదని.. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్ సాధించింది ఏవిÖ లేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో విÖడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచులను గెలిచామని.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచఎంసీ ఎన్నికలు జరుగుతాయి. జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే అలోచనలో ప్రభుత్వం లేదు. జీహెచఎంసీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలేనన్నారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నామని.. శివరాత్రి లోపలే మున్సిపల్ ఎన్నికలు ముగిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. బస్తీబాట కార్యక్రమంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నాం. పదేళ్లలో మేము చేసినవి.. కాంగ్రెస్ రెండేళ్లుగా చేయనివి గుర్తు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సర్వేలు, అభ్యర్థి బలాలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికల్లో జనసేన సహా ఎవరైనా పోటీ చేయొచ్చు. క్షేత్రస్థాయిలో బలముంటే తప్ప.. స్థానిక ఎన్నికల్లో గెలవటం ఈజీ కాదు. జిల్లాలను ఎత్తేసే ప్రయత్నం జరుగుతుంది. జనగాం, నారాయణ పేట, వనపర్తి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఎత్తేస్తారనే ఆందోళన ఉంది .జిల్లాలు ఉండాలా.. పోవాలా..? అనేది మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? రేవంత్ రెడ్డి చేస్తోన్న తుగ్గగ్ పనులతో జంట నగరాల అస్థిత్వం దెబ్బ తింటుంది . సినిమా టిక్కెట్లు పెంచేది లేదని యూ టర్న్ తీసుకున్నారు. మున్సిపాలిటీల వారీగా బీఆరఎస్ ఇంచార్జ్‌లు నియమిస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఇంచార్జ్ నియమించామని.. 8 ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. జిల్లాల తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. దీనితో చాలా చోట్ల ప్రజల్లో ఆందోళన ఉన్నదని కేటీఆర్ అన్నారు. కొత్త జిల్లాలు చేసిన పట్టణాల్లో జిల్లాలు ఎత్తేసారు అనే భావనలో ఉన్నారు. ప్రజలు అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. జిల్లాల అంశాన్ని ప్రధాన అస్త్రంగా మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కో ఆర్డినేటర్లను పెడుతున్నాం.స్థానిక నాయకులు ఎవరికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారు.ఎన్నికలు లేని నాయకులు, ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికల దగ్గర ఇంచార్జ్ లుగా నియమిస్తాం.లోకల్ ఎన్నికలు కాబట్టి లోకల్ వాళ్లే ప్రచారం చేస్తారు.స్థానికత ఆధారంగా ప్రచారం నిర్వహించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.స్థానిక సమస్యలను ఎజెండాగా ముందుకు తీసుకొని ముందుకు వెళ్తాం. ముఖ్యమంత్రి హార్వర్డ్ వెళ్లి మంచిగా తిరిగి వస్తారు అనుకుంటున్నా. పఠాన్ చెరువు ఎమ్మెల్యే కూడా మా బీఆరఎస్ పార్టీనే గెలిపించాలి అంటున్నారు. మేము కూడా అదే అంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.పార్టీ మారిన తర్వాత ఆయా నియోజకవర్గాలలో వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేస్తున్నారు.
తెలంగాణ దుర్భర పరిస్థితులకు నిదర్శనం
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత ఆందోళనకరమని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యరాష్ట్రంనాటి సంక్షోభ పరిస్థితులు తెలంగాణవ్యాప్తంగా నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమని అన్నారు. ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికీ ఈ చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని మండిపడ్డారు. భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్ లో దేవ్ సోత్ సర్వేశ్, ఆదిలాబాద్ లో జాదవ్ అంకుష్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు రైతుల ఆత్మహత్యలకు అప్ప్పులే ప్రధాన కారణం కావడం, రేవంత్ సర్కారు మోసాలను, అబద్ధపు హావిÖల పేరిట చేసిన తీరని ద్రోహాన్ని అడుగడుగునా ఎత్తిచూపుతోందని అన్నారు. రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు, పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్నదాత పరిస్థితి అనాథలా మారిందని అన్నారు. కేవలం రెండేళ్ల కాలంలోనే దాదాపు 900 మంది రైతులు గుండెపగిలి బలవన్మరణాలకు పాల్పడినా ఈ సన్నాసి సర్కారుకు ఇప్పటికీ సోయి రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్లు ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ఇవాళ మోగుతున్న ఈ మరణమదంగానికి రేవంత్ సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్నదాతలారా.. దయచేసి ధైర్యం కోల్పోకండి. మరో మూడేళ్లు ఓపిక పట్టండని సూచించారు. ఈ వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని, రైతు ద్రోహి రేవంత్ ను గ్దదెదించుదామని.. మన తెలంగాణలో వ్యవసాయరంగానికి మళ్లీ మంచిరోజులు తెచ్చుకుందామని అన్నారు. వివరాల్లోకి వెళితే.. అప్ప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన కోడెల సదానందం (42) పోతులవాయి శివారులో తనకున్న 4 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. పెట్టుబడుల కోసం తెచ్చిన రూ.2 లక్షలకుపైగా అప్ప్పు అలాగే ఉండిపోయింది. అప్ప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇం ట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మతుడికి భార్య రమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కాటారం ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బతుకమ్మతండాకు చెందిన రైతు దేవ్‌సోత్ సర్వేశ్ (57) తనకున్న ఎకరం ఐదు గుంటల పొలంలో బోరు వేశాడు. ఇల్లు కట్టి, ఇద్దరు కుమారుల పెండ్లి చేయడానికి రూ.8 లక్షల వరకు అప్ప్పు చేశాడు. అప్ప్పులు ఎక్కువయ్యే సరికి వాటిని ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈనెల 11న పెద్దకొడుకు అనిల్‌కు ఫోన్‌చేసి గడ్డిమందు తాగినట్టు చెప్పాడు. వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడ నుంచి హైదరాబాద్‌లోని గాం ధీ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ మతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పి ట్‌గావ్ గ్రామానికి చెందిన రైతు జాదవ్ అంకుష్ (33) తనకున్న మూడెకరాల్లో పత్తి, కంది సాగు చేశాడు. ఇందుకోసం అప్ప్పులు తీసుకున్నాడు. అప్ప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసిక వేదనకు గు రైన అంకుష్ ఈనెల 18న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం మతి చెందాడు.


