రాష్ట్ర అభివద్ధికి కోసం చిత్తశుద్ధితో కషి చేస్తున్నాం

` విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
` తెలంగాణలో వైద్యవిద్యకు పెద్దపీట
` అన్ని వర్గాల సంక్షేమమే మా లక్ష్యం
` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
` గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు
` గ్రామాలను అభివద్ది చేసుకుంటే మన తల్లికి సేవ చేసినట్లే:మంత్రి సీతక్క
జగిత్యాల బ్యూరో(జనంసాక్షి):రాష్ట్ర అభివద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ధర్మపురి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివద్ధి చెందాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సి ఉంటుందని, అందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యాభివద్ధి కోసం ప్రత్యేక దష్టి సారించిందని అన్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చామని అన్నారు. ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని నిర్మించి, కుల మతాలకతీతంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ధర్మపురి క్షేత్రంలో గోదావరి నీరు కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్ర నిర్మాణం కోసం రూ.24.50 కోట్లతో వ్యయంతో పోటీ చేయడం జరుగుతుందని, ధర్మపురి పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాల కోసం రూ .15 కోట్లు,ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం రూ.10 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. ప్రస్తుతం 263.40 కోట్ల వ్యయంతో 15 అభివద్ధి పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వాలు కులాల వారీగా విద్యార్థులకు వసతి గహాలను నిర్మించి, వారి మధ్య అసమానతను పెంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యతోపాటు, అక్కడే ఉండి చదువుకునేలా అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రం ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హావిÖ మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. గత బిఆరఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ లతో ఇండ్లు నిర్మిస్తామని హావిÖ ఇచ్చి ప్రజలను మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని అన్నారు. మహిళల లబ్దికోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని, దాంతో వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు.అలాగే ఉచిత విద్యుత్ సౌకర్యంతో నిరుపేదలకు లబ్ధి చేపడుతుందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం అంటే ఒక పండుగలా మారిందని అన్నారు. రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, అలాగే వరి ధాన్యానికి బోనస్ డబ్బులు సైతం అందిస్తున్నామని అన్నారు. రైతులు ఆయిల్ పామ్ పంటలను సాగు చేయాలని,దాంతో ఆర్థికపరంగా ఎంతో లబ్ధి చేకూరుతుందని సూచించారు.అలాగే మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ అభివద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సహకారంతో నిరంతరం కషి చేస్తానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నుండి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నానని అన్నారు. ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని మూడు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని, అలాగే ట్రాన్స్ కో డివిజన్ ఏర్పాటు, విద్యుత్,తీగల,పోల్స్ కోసం మారో రూ.6 కోట్లు మంజూరు చేయాలని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కోరగా,అందుకు ఆయన సానుకూలంగా స్పందించడంతో సంతోషం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హావిÖ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్, ఎన్ పి డి సీ ఎల్ సి ఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు
జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నూకపల్లి న్యాక్ సెంటర్ లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రావిÖణాభివద్ది శాఖ, మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మూడు విడతలుగా 385 మంది సర్పంచ్ లకు శిక్షణ అందిస్తున్నామని ఈ నెల 19 నుండి 23 వరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మొదటి విడుత 122 సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడికి ఆహ్వానించినందుకు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయితీ ఎన్నికలలో ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకొని, ఎదురైన ఇబ్బందులను తట్టుకొని ప్రజల చేత ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, గుర్తించిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించే విధంగా పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు. మనం శాశ్వతం కాదు, మన పదవులు శాశ్వతం కాదు, కానీ మనం చేసే పనులు ఎప్పటికీ శాశ్వతం అని ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తు ఉంటాయని తెలిపారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుతాయని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నులు ముఖ్యంగా గ్రామాలను అభివద్ధి పరచాలంటే పాలనాపరంగా ఏం కావాలో ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుసుకోవచ్చని అన్నారు. మన గ్రామాన్ని అభివద్ది చేసుకుంటే మన తల్లికి సేవ చేసినట్లే, మన గ్రామానికి మంచి పని చేస్తే గ్రామ ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. మనపేరు గ్రామంలో చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా అహర్నిశలు పనిచేయాలి. సర్పంచులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ సుపరిపాలన అందించి గ్రామాలను అభివద్ధి పరుస్తూ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కోరారు. గ్రావిÖణ ఉపాధి హావిÖ పథకం లో వచ్చిన మార్పులను కూడా సర్పంచ్ లు గమనించాలని, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివద్ధికి కషి చేయాలని తెలిపారు.
గ్రామంలో నిరుపేదలను గుర్తించాలని వారికి ప్రభుత్వం ద్వారా లబ్ది అందేలా చూడాలని, బాల్య వివాహాలపై అవగాహనా కల్పించాలని, యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలు అందేలా చూడాలని గ్రామ ప్రథమ పౌరులు గా విÖరు అన్ని వర్గాల అభివద్ధి కి మరియు గ్రామ సర్వతోముఖాభివద్ధికి పాటుపడాలని కోరారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇటీవల గ్రామ పంచాయితీలకు 277 కోట్లు మంజూరు చేసిందని గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ నిధులు 2000 కోట్లు త్వరితగతిన వచ్చేలా కషి చేస్తున్నామని తెలిపారు. వచ్చిన నిధులను గ్రామంలో ప్రాధాన్యత ప్రకారం మరియు గ్రామసభలో తీసుకున్న తీర్మానాల ప్రకారం ప్రజా ఉపయోగ పనులను గుర్తించి వాటికోసం వినియోగించాలని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులుగా ఎన్నికైన విÖరు పంచాయితీ కార్యదర్శులను అలాగే ఇతర అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని సుపరిపాలన అందించాలని విÖ గ్రామాలను ఆయా గ్రామాలని ఆదర్శవంతమైన గ్రామాలుగా మరియు ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేరళ రాష్ట్ర గ్రామాలను ఆదర్శంగా తీసుకుని విÖరు కష్ట పడి పనిచేసి విÖ గ్రామాలను అభివద్ధి లో ముందంజ లో ఉంచి ఉత్తమ గ్రామాలుగా అవార్డులు సాధించే విధంగా కషి చేసి దేశంలోనే మన తెలంగాణ రాష్టాన్ని అగ్రస్థానంలో ఉంచాలని అలాగే జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంచే విధంగా విÖరంత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జెడ్పీ సి.ఈ.ఓ గౌతం రెడ్డి, ఆఖీఆO రఘువరన్, డిప్యూటీ సిఈవో పి. నరేష్, జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్, ఆచిO బి. నరేష్, పంచాయతీ రాజ్ ఈఈ లక్క్ష్మణ్ రావు, శిక్షణ జిల్లా పంచాయతీ అధికారి, రేవంత్, ఎంపిడివోలు, ఎంపివోలు, టివోటిలు, సంబంధిత అధికారులు, డిపివో కార్యాలయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.