అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస

రుద్రూరు (జనం సాక్షి)

రుద్రూరు మండలం అక్బర్ నగర్ లో రూ. 2.50 కోట్లతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు, సంస్కార్ ఆశ్రమం ఉద్యోగులు, సిబ్బంది..అనంతరం సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో రూ. 50 లక్షల SDF నిధులతో నిర్మించిన “పోచారం శ్రీనివాసరెడ్డి యోగశాల” ను ప్రారంభించిన సభాపతి పోచారం, మంతెన సత్యనారాయణ రాజు .ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరైన రూ.600 కోట్ల స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నిధులతో ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులను చేయించాను.నేను 1994 లో మొదటిసారి MLA అయినప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం ఒక్కటే జూనియర్ కాలేజీ ఉండేది. ఇప్పుడు అన్ని కలిపి 31 అయినవి.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతో మన బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేశారు.ఇందులో 4000 ఇళ్ళను కాంట్రాక్టర్లు నిర్మిస్తే మిగితా 7000 ఇళ్ళు లబ్ధిదారులు స్వంతంగా కట్టుకున్నారు.ఇంకా ఎవరైనా పేదలు మిగిలితే గృహలక్ష్మి పథకంలో వారికి ఇంటిని మంజూరు చేస్తాను.తక్కువ ఖర్చుతో రోగులకు అద్భుతమైన ప్రకృతి వైద్యాన్ని అందిస్తున్నది సంస్కార్ ఆశ్రమం.ఇంత బాగా సేవలను అందిస్తున్న ఈ సంస్కార్ ఆశ్రమం దేశంలోనే మొదటిది.ఈ సంస్కార్ ప్రకృతి ఆశ్రమం ద్వారా వంద కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుంది.పెద్ద జబ్బులకు కూడా ఇక్కడ చికిత్స చేస్తున్నారు.నగరాలలో ఉన్న ప్రకృతి చికిత్స కేంద్రాలు వ్యాపారాత్మక దోరణిలో ఉంటాయి.ఈ ఆశ్రమంలో మాత్రం సేవాభావంతో సేవలు చేస్తున్నారు.సేవా దృక్పథంతో, ఎలాంటి లాభం ఆశించకుండా సంస్కార్ ఆశ్రమం అభివృద్ధికి తోడ్పడుతున్న మంతెన సత్యనారాయణ రాజు గారికి మన అందరి తరుపున ధన్యవాదాలు.ఇంత మందికి ఉపాధి కలిగిస్తున్న సంస్థకు అండగా ఉండడం ప్రభుత్వం బాధ్యత.ఆశ్రమంలో వసతుల కల్పనకు నా వంతుగా SDF ద్వారా నిధులు మంజూరు చేయిస్తాను.