అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్‌బాబు

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : రామగుండం కార్పొరేషన్‌ ఏరియా పరిధిలో పలు అభివృద్ది పనులకు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్‌ కమిషన్‌ గడ్డం మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియా పరిధిలోని కమ్యూనిటీ హాల్‌లో శ్రీధర్‌బాబు చేతుల మీదుగా 1348 లబ్ధిదారులకు దీపం పథకం క్రింద గ్యాస్‌ కనెక్షన్లు, 22 మందికి వికలాంగులకు రూ.33,923 రుణాలు, 17 మందికి సమాఖ్య సభ్యులకు రూ.7,39,707, జాతీయ కుటుంబ ప్రయోజన పథక 51 మందికి రూ.25,500 రుణాలను అంద చేయనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. అదేవిధంగా కార్పొరేషన్‌కు మంజూరైన బీఆర్‌జీఎఫ్‌ రూ.90లక్షల 70వేల నిధులు, ప్లాన్‌గ్రాంట్‌కు సంబంధించిన రూ.61 లక్షల 45 వేలు, అదేవిధంగా 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి రూ.కోటి 54 లక్షల 54 వేలు, రూ.4 కోట్ల 52 లక్షల 63 వేలు, ఫ్లర్‌గ్రాంట్స్‌తో రూ.50లక్షలతో ఏర్పాటుచేసే అభివృద్ధి గుడిసెల వివేక్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తదితరులు హాజరుకానున్నట్లు కమిషనర్‌ తెలిపారు.