అవినీతి మంత్రుల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి

హైదరాబాద్‌ :
వైఎస్‌ అవినీతిలో పాలుపంచుకున్న మంత్రులు కిరణ్‌ సర్కారులో ఉన్న ఫలితమే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణను విమర్శించారు. అవినీతి పై ప్రభుత్వాన్నికి మాట్లాడే అర్హత లేదన్నారు. మద్యం నూతన విధానాన్ని రద్దు చేసేందుకు శాంతి భద్రతలు అడ్డొచ్చినా పోరాటం సాగిస్తామని తెలిపారు. లాటరీ పద్దతి జరిగే ఈ నెల 26న నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాట్లు నారయణ తెలిపారు. వాన్‌పిక్‌ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించేలా ప్రకాశం, గుంటూరు, జిల్లాలో ప్రత్యక్ష పోరాటం సాగిస్తామని తెలిపారు. పట్టణ సమస్యలపై జూలై 15 నుంచి 21 వరకూ ప్రచార వారోత్సవాలు నిర్వహించి, 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్‌ కార్యలయాలను ముట్టడించనున్నట్లు నారాయణ వెల్లడించారు.