అసెంబ్లీలోని భవనంపైకి ఎక్కి నిరసనలు

హైదరాబాద్‌: అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టకుండా తమను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోని ఓ భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఆమెకు నచ్చజెప్పడంతో కొదిసేపు నిరసన అనంతరం కిందికి దిగి వచ్చారు.