అసెంబ్లీలో ముక్కునేలకు రాస్తా : హరీష్‌రావు
హైదరాబాద్: ఇందిరా జలప్రభ వల్ల తెలంగాణకు ఒరింగిందేమీలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ ఇందిరా జల ప్రభ ‘ వల్ల తెలంగాణలో కనీసం పది ఎకరాల భూమి తడిచినా తాను ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వానికి సవాలు విసిరారు. నీళ్ల విషయంలో తెలంగాణకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.



