ఆంధ్ర విశ్వవిద్యాలయంపై శాసనసభ కమిటీ అసంతృప్తి

హైదరాబాద్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంపై బీసీ శాసనసభ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఉద్యోగ నియామాకాల్లో రోస్టర్‌ విధానాన్ని పాటించటంలేదని నియమావళికి సంబందించిన రికార్డులను కూడా సరిగా నిర్వర్తించటం లేదని  కమీటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయాంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కమీటీ చైర్మన్‌ జి.తిప్పేస్వామి ప్రశ్నించగా రిజిస్టార్‌, వీసీ సరిగా సమాదానం చెప్పలేకపోవటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.