ఆజాద్‌ను కలిసిన తెలంగాణ జేఏసీ నేతలు

న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ను తెలంగాణ జేఏసీ నేతలు ఇవాళ కలిశారు. సకల జనుల సమ్మె కాలంలో ఇచ్చిన హామిలను నెరవేర్చాలని ఆజాద్‌ను కోరామని జేఏసీ నేతలు తెలియజేశారు. తెలంగాణపై త్వరగా తేల్చాలని కోరినట్లు పేర్కొన్నారు. తెలంగాణపై త్వరలో తేల్చవపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించామని చెప్పారు.