*ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : ఆడపడుచులకు దసరా కానుకగా టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీ లో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడితే కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇయ్యని హామీలను సైతం నెరవేరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించి ప్రతి దసరా పండుగకు రాష్ట్రంలోని అందరికీ చీరలు పంపిణీ చేస్తు ప్రతి ఒక్క ఆడబిడ్డకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు కూడా ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణకు బతుకమ్మ పండుగ ఎంత ముఖ్యమో, దేశంతో పాటు ప్రపంచ దేశాలలో కూడా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్,కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు బండి భాగ్య లక్ష్మి శ్రీకాంత్ యాదవ్, కొండ ప్రవీణ్ గౌడ్, అజయ్, మున్సిపల్ అధికారులు అనిల్ కుమార్, నర్సిములు, దుర్గ,ఆర్పీలు,మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : ఇంద్రారెడ్డి కాలనీలో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న  ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.