‘ఆత్మబలిదానాలకు కేంద్రం మొండి వైఖరే కారణం’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరితోనే తెలంగాణ ప్రాంతంలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఐకాస నేతలు ఆరోపించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 1041 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస నేతలు దామోదర్‌, సత్యనారాయణ, ప్రభాకర్‌లు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలందరూ ఉద్యమిస్తున్నా రాజకీయ పార్టీలు ఐక్యంగా ముందుకు రాకపోవడంతోనే కేంద్రం జాప్యం చేస్తున్నదని ఆరోపించారు. యువకుల బలిదానాలకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రజల కోసం పనిచేయని పార్టీలను తెలంగాణ ప్రాంతంలో అడ్రస్‌ లేకుండా చేస్తారని వారు హెచ్చరించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించుకుందామని, యువత ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారు విజ్ఞప్తి చేశారు.