ఆత్మహత్యలతో ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు వైఎస్‌ఆర్‌ సీపీపై కాంగ్రెస్‌ ద్వంద్వ ధోరణి

 రాయికల్‌/  వేములవాడ, ఆగష్టు1 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే ఉద్యమకారులు చివరివరకు పోరడ కుండా ఆత్మహత్యలు చేసుకోవడం వలన తెలంగాణ ఒక ఉద్యమాన్ని కోల్పోవడమేకాకుండా పరోక్షంగా తెలంగాణ వ్యతిరేతకు సహ కరిస్తూ ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారని ఆవేదనతో మాజీ తెరాస యం.పి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణకై ఆత్మహత్య చేసుకున్న రాజారపు జనార్దన్‌ కుటుంబసభ్యులను మాజీ  యం.పి వినోద్‌కుమార్‌ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జనార్దన్‌ ఫోటోకు నివాళులు అర్పించారు. మృతునిభార్యకు 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. యం.పి విలేకరులతో మాట్లాడుతూ సిరిసిల్లలోనిర్వహించిన విజయమ్మ సభలో తెలంగాణ వాదుపై జరిగిన ఘటనను ఉద్యమకారులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఆత్మహత్యలతో తెలంగాణ ఉద్యమం సైని కుల్లాంటి ఉద్యమకారులను కోల్పోతుందన్నారు. తెలంగాణకై ఆత్మహత్యలు ఎందుకుచేసుకుంటున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తెలంగాణాలో పుట్టిన భూమిపుత్రులు తెలంగాణను కన్నతల్లితో సమానంగా చూస్తారు, కన్నతల్లిని ఎవరైనా అవమానిస్తే ఎలా ఐతే తట్టుకోరో తల్లితెలంగాణ ను అవమాన పరిచినట్లైతే అలాగే తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణాకు వ్యతిరేఖంగా కేంద్రహోంశాఖ రాష్ట్రపతికి నివేదికను పంపిందనే వార్తపై స్పందిస్తూ అదంతా అసత్యమని సీమాంద్రా ఛానళ్ళ దష్ప్రచారమని ఆయన మండిపడ్డారు. యం.పి వినోద్‌తో తెరాస నియోజకవర్గ ఇంచార్జ్‌ ఓరుగంటి రమణారావు, మండల అద్యక్షులు బొంగోలి భూమాగౌడ్‌, పట్టణ కన్వీనర్‌ తిరు పతిగౌడ్‌, ప్రసాద్‌, బత్తుల మల్లయ్య, రాజనాయక్‌, శినీతి రమ్య, క్రిష ్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

:వైఎస్‌ఆర్‌ సిపిపై అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తలో రకంగా మాట్లాడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని  టిఆర్‌ఎస్‌ పోలిట్‌ బ్యూరో సభ్యులు వినోద్‌ కుమార్‌ ఆరోపించారు. బుధవారం వేములవాడలోని ఓ  పెళ్ళి కార్యక్రమానికి హాజరుకావడానికి విచ్చే సిన మాజీ ఎంపి వినోద్‌ రాజన్నను సందర్శించుకున్నారు. అనం తరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీకి చెంది న పెద్దలు (రాజ్యసభ సభ్యులు) వి. హన్మంతరావు, కెవిపి రాంచంద ర్‌రావులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై విభిన్న ధోరణితో వ్యవహరిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నపుడు రాజశేఖర్‌రెడ్డి దోచుకున్న డబ్బును తన కుమారుడు వైఎస్‌. జగన్‌కు అప్పగించాడని, ఆయన పాలనంతా అవినీతిమయమేనని కాంగ్రెస్‌ ఎంపి హన్మంతరావు విమర్శిస్తుండగా, మరో పక్క కెవిపి రాంచందర్‌రావు రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి పేషీలో ఉంచాలని వాదిస్తూ, ద్వంద్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.  గత ఉప ఎన్నికలు జరిగిన ఆంధ్రా ప్రాంతంలో కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ సిపిలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోగా, గత రాష్ట్రపతి ఎన్నికలలో సాక్షాత్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీయే తనకు సహకరించాలని వైఎస్‌ఆర్‌ సిపి గౌరవ అధ్యక్షులు విజయమ్మను కోరడం, ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు వేయడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాగా ఓ పక్క అవినీతి కేసులకు సంబంధించి కాంగ్రెస్‌ కనుసన్నల్లో మెలిగే సిబిఐ జగన్‌ను జైలుకు పంపించగా, మరోపక్క రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ జగన్‌ మద్దతు కోరడం ప్రజల్ని తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు.  అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న జగన్‌ పార్టీ  త్వరలో కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమని వినోద్‌ పేర్కొన్నారు.

తెలంగాణావాదాన్ని అణగదొక్కడానికి కాంగ్రెస్‌ కుట్ర :  తెలంగాణా అంశాన్ని అణగదొక్కడానికి వైఎస్‌ఆర్‌ సిపి, కాంగ్రెస్‌లు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని టిఆర్‌ఎస్‌ మాజీ ఎంపి వినోద్‌ కుమార్‌ ఆరోపించారు. కాగా సమైక్యవాది జగన్‌ సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణా ప్రాంతంలో వెదజల్లి తెలంగాణావాదాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా  ప్రత్యేక తెలంగాణాపై తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్‌ నాయకులు ఓరుగంటి రమణారావు, మాదాడి గజానందరావు, ఎర్రం మహేశ్‌, టిఆర్‌ఎస్‌వి నాయకులు వెంగళ శ్రీకాంత్‌ గౌడ్‌, నిమ్మశెట్టి విజయ్‌, సార్ల చారి తదితరులు పాల్గొన్నారు.