ఆదిలాబాద్‌లో పోలీసు కుటుంబసభ్యుల ఆందోళన

ఆదిలాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలనిఏపీఎస్పీ బెటాలియన్‌ కుటుంబసభ్యుల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. తమ భర్తలను నెలల తరబడి కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిపేట 13వ బెటాలియన్‌ ఎదుట ఏపీఎస్పీ పోలీసు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దూరప్రాంతాల్లో తమ భర్తలకు విధులు వేయవద్దని కోరారు. అధికారులు హామీ ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించమిని హెచ్చరించారు.