ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి

share on facebook

ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి.ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి.ఎంపీడీఓ మారుతి,ఏఓ శ్రీనివాస్ రావు.
కోటగిరి డిసెంబర్ 2 జనం సాక్షి:-ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోటగిరి మండల ఎంపీడీఓ మారుతి,ఏఓ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.శుక్రవారం రోజున మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం గురించి ఎంపీడీఓ,ఏఓ ఆధ్వర్యంలో మండల కార్యదర్శులు,ఏఈఓలు,ఫీల్డ్ అసిస్టెంట్ లకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.మండలానికి 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ మొక్కలు  పెంపకంపై మండల రైతులకు గ్రామ సభ నిర్వహించి అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రత్యామ్నాయంగా రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై మళ్లీంచేందుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల ఫీల్డ్ అసిస్టెంట్,కార్యదర్శులు,ఏఈఓ లపై ఎంతైనా ఉందని అన్నారు.ఈ సమావేశంలో కార్యదర్శులు, ఏఈఓలు,ఫీల్డ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు

Other News

Comments are closed.