ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..తప్పిన ప్రమాదం
సూర్యాపేట,అగస్టు9(జనంసాక్షి): జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.