రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జనవరి 8 ( జనం సాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ గేటు వద్ద చోటు చేసుకుంది. ఐబీఎస్ నుంచి 5మందితో వెళ్తున్న కారు..చెట్టును ఢీ కొట్టింది
ఈ ప్రమాదంలో సూర్య తేజ, సుమిత్,శ్రీ నిఖిల్,రోహిత్ అనే నలుగురు విద్యార్థులు చనిపోగా.. నక్షత్ర అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. వీరంతా ఐబీఎస్ కాలేజీకి చెందిన బీబీఏ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



