అండర్ 14 రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

 

 

 

 

 

రామకృష్ణాపూర్, జనవరి 08 (జనంసాక్షి):స్కూల్ గేమ్స్ అండర్ 14 విభాగంలో నిర్వహించిన జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన మందమర్రి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జనవరి 6న నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్ 14 నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు తరఫున పాల్గొని సత్తా చాటి, రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు.
మందమర్రి పట్టణంలోని హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థులు రాంటెంకి అశ్వద్, బెల్లం మనస్విలు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 16, 17, 18 తేదీలలో ఖమ్మంలో జరగనున్నాయి.ఈ సందర్భంగా పట్టణ సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ విద్యార్థులను షాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు. భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.పాఠశాల డైరెక్టర్ రామ్ వేణు మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. క్రికెట్, ఆర్చరీ, నెట్‌బాల్, ఖో-ఖోతో పాటు అథ్లెటిక్స్‌లో నిపుణుల ద్వారా శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గుణవతి, ఉపాధ్యాయులు తిరుమల, బద్రి, పీఈటీ గణేష్, శ్రీజ, షరీనా, శివాని, స్పందన,విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.