స్థాయికి తగ్గ మాటలు నేర్చుకో కేటీఆర్

 

 

 

 

 

 

 

 

 

బచ్చన్నపేట జనవరి 8 ( జనం సాక్షి):

 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ స్థాయికి దగ్గ మాటలు మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల సీనియర్ నాయకుడు జంగిటి విద్యనాథ్ అన్నారు. జనగామలో కేటీఆర్ చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నామని పదేళ్లు అధికారంలో ఉండి జనగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, ఏనాడ ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందించలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని తెలియజేశారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామస్థాయి నుండి నేడు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన నాయకుడు అని అన్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. మీ అహంకార పొగరు మాటలకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారని, బిఆర్ఎస్ పార్టీ భూ స్థాపితం కావడం ఖాయమని హెచ్చరించారు