నాణ్యమైన భోజనం అందించండి

` ప్రతి రెండు నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు
` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి
` ముఖ్యమంత్రిని కలిసిన హిమాచల్‌ విద్యాశాఖ మంత్రి
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. సవిూక్షలో ప్రభుత్వ సలహాదారులు కేకే, సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై చర్చ జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ అందించాలని సీఎం ఆదేశించారు. సోలార్‌ కిచెన్లు ఏర్పాటు చేసే అంశాన్నిచ పరిశీలించాలరని రేవంత్‌ సూచించారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం వేగంగా జరగాలని ఆదేశించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో యంగ్‌ ఇండియా స్కూళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
రేవంత్‌ను కలిసిన హిమాచల్‌ విద్యాశాఖ మంత్రి
సచివాలయంలో సీఎం రేవంత్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి రోహిత్‌ కమార్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకువస్తోన్న సంస్కరణలు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, స్కిల్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు వివరాలను రోహిత్‌ కుమార్‌తో రేవంత్‌ పంచుకున్నారు. జాతీయ విద్యా విధానం తరహాలో త్వరలో తెలంగాణ విద్యా విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్‌ వివరించారు.