ఎమ్మెల్యేను కలిసిన బిఆర్ఎస్ నేత : కోడూరు శివకుమార్ గౌడ్

 

 

 

 

 

 

 

బచ్చన్నపేట జనవరి 7 ( జనం సాక్షి): ఆరోగ్య ప్రదాత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరిని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిన మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన సామాజికవేత్త. గ్రామ ఆపద్బాంధవుడు. బి ఆర్ ఎస్ నాయకులు కోడూరు శివకుమార్ గౌడ్. బచ్చన్నపేట మండలంలోని కోన్నే గ్రామంలో శ్రీ మినలాపురం హనుమంతరావు పంతులుచే జరిగే శ్రీ రుద్ర సహిత శత చండీయాగ మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా ఎమ్మెల్యేను కోరడం జరిగిందని ఈ కార్యక్రమం ఈనెల 10వ తేదీన జరుగును కాబట్టి పూర్ణాహుతి ఆశీర్వచనం మరియు అన్నదాన కార్యక్రమానికి హాజరవుతానని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్గసిద్ధి రాములు పాల్గొన్నారు