ఆర్డీవోకు ఇసుకమాఫియా బెదిరింపు కాల్స్‌

మహబూబ్‌నగర్‌: ఇసుక మాఫియా ఆగడాలు పెట్రేగిపోయాయి. ఆర్డీవోకే చంపుతామని బెదిరించే స్థాయికి ఎదిగిపోయారు. నాగర్‌కర్నుల్‌ ఆర్డీవో మధుసుదన్‌కు ఉప్పుగుంతల ఏరియా నుంచి ఇసుక రవాణాను అడ్డుకుంటే నిన్ను చంపుతామని బెదిరించారు. ఆర్డీవో మధుసుదన్‌ ఈ ఫోన్‌ కాలుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.