ఆర్డీవో ఆఫీస్‌పైకి ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి: కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే రామారావు స్థానిక ఆర్డీవో కార్యాలయంపైకి ఎక్కి హంగామా సృష్టిస్తున్నారు. తన నియోజకవర్తానికి సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నీలం తుపాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. దీపం పథకంలో తన నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు కార్యాలయంపై నుంచి కిందకు దిగానని తేల్చి చెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.



