ఆర్‌ఐపై దాడికి యత్నం

విజయవాడ, జూలై 27 : కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయి. అక్రమరవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ ఇన్ప్‌క్టర్‌పై అదే ట్రాక్టర్‌తో డీ కొట్టించేందుకు డ్రైవర్‌ యత్నించాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్‌ఐ తప్పుకున్నాడు. కంచికచర్ల మండలం గనిఅతుకూరు గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. కంచికచర్ల ఆర్‌ఐ మధుమోహన్‌ తనకు అందిన సమాచారం మేరకు ఈ ఉదయాన్నే గనిఆతుకూరు గ్రామానికి వెళుతుండగా ఇసుక నింపిన ట్రాక్టరు ఒకటి ఎదురువచ్చింది. దానిని నిలిపేందుకు ప్రయత్నించగా డ్రైవర్‌ ట్రాక్టరును ఆపకుండా ఆర్‌ఐపైకి దూకించబోయాడు. దీంతో మధుమోహన్‌ ప్రక్కకు తప్పుకోవడంతో ఆయన ప్రమాదంనుండి బయట పడ్డాడు. వెంటనే పోలీసులకు ఆర్‌ఐ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ను స్థానికులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.