ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌: జిల్లాలోని నల్లబెల్లి మండలం ముడుచెక్కలపల్లి ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థుల వేధింపుల వల్లనే ఈ ఘటన జరిగిందని భాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.