ఆసీస్‌తో సిరీస్‌కు లంక జట్టులో కరుణారతనే , ప్రదీప్
కొలంబో ,నవంబర్ 21 :వచ్చే నెలలో ఆస్టేల్రియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ జట్టును ప్రకటించారు. 16 మంది జాబితాలో ఓపెనర్ దిముత్ కరుణారతనేతో పాటు ఫాస్ట్ బౌలర్ నువాన్ ప్రదీప్‌కు చోటు దక్కింది. 24 ఏళ్ళ కరుణారతనే ప్రస్తుతం జరుగుతోన్న న్యూజిలాండ్‌తో సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. గాలే వేదికగా ముగిసిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. అలాగే గతంలో సౌతాఫ్రికా పర్యటనలో లంక ఎ తరపున పరుగుల వరద పారించడంతో సెలక్టర్లు ఆసీస్ టూర్‌కు ఎంపిక చేశారు. అటు బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్ ప్రదీప్ కూడా ఎంపికయ్యాడు. చివరిసారిగా జూలైలో పాకిస్థాన్‌పై ఆడిన ప్రదీప్ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం కివీస్‌తో జరుగుతోన్న సిరీస్‌లో ఆకట్టుకోవడంతో చోటు నిలుపుకున్నాడు. అయితే 19 ఏళ్ళ యువస్పినన్ర్ తరిందు కౌషల్‌కు మాత్రం చోటు దక్కలేదు. స్పిన్ విభాగంలో రంగన హెరాత్ , సూరజ్ రణ్‌దీవ్‌లకు చోటు దక్కింది. ఆసీస్ పర్యటన కోసం లంక సెలక్టర్లకు ఫాస్ట్ బౌలర్లకే పెద్దపీట వేశారు. మొత్తం ఐదుగురు పేస్ బౌలర్లను ఎంపిక చేశారు. వీరిలో వెలిగేదర , కులశేఖరా , దమ్మిక ప్రసాద్ , నువాన్ ప్రదీప్ , శామిండ ఎరంగ ఉన్నారు. ఇక లహిరు తిరిమన్నే , జీవన్ మెండిస్ , అఖిల ధనంజయ , అజంత మెండిస్‌లను స్టాండ్‌బైలుగా ఎంపిక చేశారు. డిసెంబర్ 14 నుండి జరిగే ఆసీస్ పర్యటనలో శ్రీలంక మూడు టెస్టులు , ఐదు వన్డేలతో పాటు రెండు టీ ట్వంటీలు ఆడనుంది. టెస్ట్ సిరీస్‌కు ¬బార్ట్ , మెల్‌బోర్న్ , సిడ్నీ వేదికలుగా నిలవనున్నాయి.
ఆసీస్ టూర్‌కు శ్రీలంక టెస్ట్ జట్టు ః
మహేళా జయవర్థనే (కెప్టెన్) , అంగేలో మాథ్యూస్ (వైస్ కెప్టెన్) , తిలకరత్నే దిల్షాన్ , కుమార సంగక్కరా , తరంగ పరనవితనా , తిలాన్ సమరవీరా , ప్రసన్న జయవర్థనే (వికెట్ కీపర్) , రంగన హెరాత్ , నువాన్ కులశేఖరా , శామిండా ఎరంగ , సూరజ్ రణ్‌దీవ్ , దినేశ్ చందిమాల్ , చనక వెలిగెదరా , నువాన్ ప్రదీప్ , దమ్మిక ప్రసాద్ , దిముత్ కరుణారతనే
స్టాండ్ బై ః లహిరు తిరిమన్నే , తిషార పెరీరా , జీవన్ మెండిస్ , అజంతా మెండిస్ , అఖిల ధనంజయ



