ఆస్ట్రేలియాలో భారత టాక్సీ డ్రైవర్‌పై దాడి

మేల్‌బోర్న్‌:
ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు మళ్ళి ప్రారంభహమవుతున్న సూచనలుకనిపిస్తున్నాయి ఓ భారత టాక్సీ డ్రైవర్‌పై తాజాగా ఆస్ట్రేలియా లో దాడి జరిగింది. అతని కారును పూర్తిగా ధ్వంసం చేశారు. డ్రైవర్‌ను జాతి వివక్షపరమైన వ్యాఖ్యలతో దూషించారు. కొంత మంది యువ కులు బేస్‌బాల్‌ బ్యాట్‌లో తిరుగుతూ మెల్బోర్న్‌ శివారులో టాక్సీ డ్రైవర్లను దోచుకుంటున్నట్లు స మాచారం అందుతోంది. మెల్బ్‌ర్న్‌ పశ్చిమ శివా రులో వేర్వేరు సంఘటనలో ఓ ముఠా ఐదు టా క్సీలపై దాడి చేసి దోపీడీకి పాల్పడింది. బేస్‌బా ల్‌ బ్యాట్లతో యువకులు రెండుకార్లను దొంగిలిం చి వాటి సాయంతో టాక్సీ డ్రైవర్లపై గత రాత్రి దాడి చేశారు. హర్‌ప్రీత్‌ సింగ్‌ సన్‌షైన్‌ ఢీ కొట్టింది. వెం టనే మరో కారు ముందుకు వచ్చి ఆగింది. బేస్‌బాల్‌ బ్యాట్లతో నలుగురు యువకులు కారలోంచి దిగి డ్రైవర్‌వైపు ఉన్న విండోను ధ్వంసం చేసినట్లు హరీప్రీత్‌ సింగ్‌ చెప్పారు. చాలా భయానకంగా ఉందని, కారును ధ్వంసం చేస్తూ తనను కొడుతూ భీతావహ స్థితిని కల్పించారని అతను చెప్పాడు. బేస్‌బ్యాట్‌ బా ల్‌ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఎడమ వైపు తాను ఒరిగానని, ఆసయంలో ఓ వ్యక్తి తన ముఖంపూ పిడిగుద్దులకు పూనుకున్నాడని ఆయన వివరించాడు. తనతో ఏమీ మాట్లాడలేదని, కారును ధ్వంసం చే స్తూ డబ్బులు డిమాండ్‌ చేశారన్నాడు. హర్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పిన విషయాలను హెరాల్డ్‌సన్‌ ప్రచురించింది. తన వద్ద 150అమెరికా డాలర్లను, మోబైల్‌ ఫోన్‌ను తీసుకొని రెండు కార్లలో వారు పారిపోయారని ఆయన చెప్పాడు. నెత్తురోడుతున్న పెదవులతో విరిగిన చేయితో డ్రైవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.