ఆస్పత్రుల సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి : నాగేందర్‌

హైదరాబాద్‌: సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రైవేటు ఆస్పత్రులు సేవలందించాలని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలో కొత్తగా కట్టిన ఇషా మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ఆధునిక శాస్త్ర పరిశోధనల ఫలితంగా మెరుగైన చికిత్సలు ఉన్నప్పటికి     అవి కేవలం ధనవంతులకే పరిమితమవుతున్నాయని ఆయన అన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లాంటేనే ప్రజలు భయపడుతున్నారని, ఆర్థిక భారం లేకుండా చికిత్సలు అందించాలని దానం ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు.