ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ఈ వారంలో నిర్ణయం: అజయ్‌జైన్
హైదరాబాద్: కళాశాల ఫీజుల నియంత్రణ కమిటీ చర్చలు తుదిదశలో ఉన్నాయని పూర్తయిన వెటనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ తేదీలను వెల్లడిస్తామని సాంకేతిక విధ్యాశాఖ కమిషనర్ లజయ్‌జైన్ తెలిపారు. ఫీజులు ఎంత పెంచాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న వెంటనే కౌన్సెలింగ్ తేదీలు వెల్లడిస్తామన్నారు. ఆరోరా విద్యాసంస్థల స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన అజయ్‌జైన్ కౌన్సెలింగ్ అలస్యంపై స్పందించారు. ఈ నెలాఖరులోపు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. తేదీల ఖరారుపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.