ఇందిరాపార్కు వద్ద ‘ తెలంగాణ దీక్షా దివాస్’
హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ‘ తెలంగాణ దీక్షాదివాస్ ‘ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, పలువురు టీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు ఈ సభకు తరలివచ్చారు.



