ఇరాక్‌లో వరుస పేలుళ్లు.. 30 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ మారోసారి రక్తమోడింది. ముష్కరుల వరుస దాడుల్లో 30 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. రాజధాని బగ్దాద్‌లో దుండగులు మూడు షియా ముస్లిం దర్గాల సమీపంలో కారు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 30 మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు తెలియజేశారు. ఘటనాస్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



