ఇరాక్‌లో వరుస పేలుళ్లు… 43 మంది మృతి
బాగ్థాద్ : ఇరాక్ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హిల్లా పట్టణంలో షియా ముస్లింలు ఏర్పాటు చేసుకున్నా టెంట్లకు సమీపంలో భారీ పేలుడు చోటుచేసుకుంది, ఈ ఘటనలో 29 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడ్డారు. అంతకుముందు బాగ్థాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న షియా పట్టణవ కర్బాలాలో నిలిపి ఉంచిన కారులో పేలుడు చోటుచేసుకొన ఆరుగురు మృతి చెందారు. ఫల్లుజా పట్టణంలో పోలీసు వాహనాల లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో ముగ్గురు, మోసుల్‌లో నిలిపి ఉంచిన కారులో పేలుడు చోటుచేసుకొని ఇద్దరు, తాజీ పట్టణంలో ఒకరు మృతి చెందారు.



