ఇసుక నిల్వలపై అధికారుల దాడులు

కొత్తూరు: విశాఖపట్నం జిల్లా కొత్తూరు మండలంలోని తగరంపూడి, సీతానగరం, వింకుపాలెం, గ్రామాల పరిధిలోని శారదానది పరివాహక ప్రాంతాల్లో మంగళవారం గనులు, రెవెన్యూ పోలీస్‌ శాఖల ఉమ్మడి బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 300లారీల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గనులశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్‌, పాండుగరంగారెడ్డి, పట్టణ ఎస్సై మల్లేశ్వరరావు ఈదాడులకు నేతృత్వం వహించారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను డీసీఎంఎస్‌ ఆవరణకు తరలించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ ఇసుకను ప్రభుత్వ నిర్మాణాలకు వినియోగించనున్నారు.