‘తుమ్మిడిహట్టి’కి కట్టుబడ్డాం
` ఆనకట్ట నిర్మాణానికి డీపీఆర్, ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
` మహారాష్ట్రతో చర్చల కోసం షెడ్యూల్ ఖరారు
` అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్(జనంసాక్షి):తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తుమ్మిడిహట్టి కోసం సవరించిన డీపీఆర్, ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మహారాష్ట్రతో చర్చల కోసం షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. నీటిపారుదలశాఖ అధికారులతో ఉత్తమ్ సుదీర్ఘ సవిూక్ష నిర్వహించారు. బ్యారేజీల భద్రత, వినియోగాన్ని నిర్ధరించేందుకు వర్షాకాలం ముందే చర్యలు తీసుకుంటున్నట్లు- మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని ప్రాజెక్టుల్లో దశలవారీగా పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉత్తమ్ సూచించారు.సమ్మక్క-సారక్క ఆనకట్ట విషయంపై ఈ నెల 23న టీఏసీ సమావేం ఏర్పాటు చేయనున్నట్లు- తెలిపారు. నివేదిక సమర్పించడంతోపాటు- ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ కోసం ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. పీఎంకేఎస్‌వై పథకం ద్వారా నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణలో ఎన్డీఎస్‌ఏ నివేదిక ప్రకారం ముందుకెళ్తామని అన్నారు. వరద తగ్గిన వెంటనే ఐఐటీ- లాంటి సంస్థలతో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి, జూరాల, కల్వకుర్తి ప్రాజెక్టులను ప్రాధాన్యంగా పరిగణించాలి. 4 ప్రాజెక్టుల భూ సేకరణ, పునరావాసం, అటవీ అనుమతులు, పెండిరగ్ సమస్యలపై దృష్టి సారించాలి. డిరడి, ఎస్‌ఎల్‌బీసీ, పెండ్లిపాక, నక్కలగండి, కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. భూసేకరణ వేగవంతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దేవాదుల ప్రాజెక్టు 3, 6 ప్యాకేజీల పనులు వేగవంతం చేయాలి. తదుపరి కేబినెట్ సమావేశానికి పురోగతి నివేదిక సమర్పించాలి.మరోవైపు ఎస్‌ఎల్‌బీసీ పనుల కోసం హెలిబోర్న్ సర్వే విషయంపై ఎన్జీఆర్‌ఐ, హిమాలయన్ హెలీ సర్వీసెస్, జేపీ అసోసియేట్స్ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృశ్యమాధ్యమ సవిూక్ష నిర్వహించారు. ఎస్‌ఎల్‌బీసీ వద్ద 2 హెలిప్యాడ్‌లను సర్వే కోసం ఉపయోగించు కోవచ్చని అధికారులు తెలిపారు. డీజీసీఏ, ఇతర అనుమతుల పక్రియను వేగవంతం చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. క్షేత్రస్థాయి అధ్యయనాలు కొనసాగించాలన్నారు.