గోదావరి జలాలను తరలిస్తాం..
హైదరాబాద్ దాహార్తి తీరుస్తాం
` ‘శ్రీపాద ఎల్లంపల్లి’ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదు
` మూసీ ప్రక్షాళనను చేపట్టి తీరుతాం
` ఈ ప్రాజెక్టుతో నల్లగొండకు ఊపిరి
` గోదావరి తాగునీటి సరఫరా పథకం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు- సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వరద నియంత్రణ కోసమే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించడానికే పీజేఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా.. ఉస్మాన్‌సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.గోదావరి నదీ జలాలను మూసీ నది, ఈసా నదిలో సమ్మేళనం చేసి నగర ప్రజల దాహార్తిని తీర్చుతాం. హైద్రాబాద్ నగరంకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరుంది. 1908లో నగర ప్రమాదాన్ని నివారించడానికి నిజాం సర్కార్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. ప్రపంచంలోనే గొప్ప ఇంజినీర్లతో నిజాం సర్కార్ ఈ ప్రాజెక్టులు కట్టింది. దూరదృష్టితో ఆలోచించి ఈ ప్రాజెక్టులు కట్టడంతో నగర దాహం తీరుతోంది. నగరంలో జనాభా పెరుగుతోంది, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్నారు. నగర జనాభా కోటిన్నరకు చేరింది. పీజేఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఖాళీ కుండలతో అసెంబ్లీ ముందు ధర్నాలు చేసి.. మంజీరా, కృష్ణా జలాలను హైదరాబాద్ తరలించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు శ్రీపాద ఎల్లంపల్లి నీటిని తరలించడానికి శంకుస్థాపన చేస్తే 2014 నుంచి నగరానికి వచ్చాయి’ అని సీఎం రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని అన్నారు. సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎవరు అడ్డం వచ్చినా ఈ పథకం పూర్తి చేస్తాం. నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా, నల్గొండ ప్లోరైడ్ సమస్య తీరుతుంది. భారత రాష్ట్ర సమితి వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది. మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలి. త్వరలో మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎంను కలుస్తామని సీఎం అన్నారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? అని సీఎం ప్రశ్నించారు. రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేయనున్నారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ జిల్లాలో మూసీ నది కాలుష్యానికి మారు పేరుగా మారింది. ఆ నీరు త్రాగి పశువుల ప్రాణాలే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. మూసీ నది నీటి వల్ల ఆడబిడ్డలకు పురిటి సమస్యలకు కారణం అవుతుంది. నల్లగొండ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ పరిస్థితి చూసి మూసీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీల నీరు, కంపెనీల కాలుష్యం మూసీలో కలవకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు పెట్టడం జరిగిందన్నారు. గేట్ వే ఆఫ్ డిల్లీ, గేట్ వే ఆఫ్ ముంబై ఉంది. ఇప్పుడు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కూడా ఉంటది. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలి. అందుకు విూ అందరి సహకారం కావాలి. రాబోయే రోజుల్లో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేద్దాం. ఎవరు అడ్డుకున్నా మన ప్రభుత్వం తిప్పి కొడుతుందన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, పేద్దోళ్ల రాజ్యం. పేదోళ్లకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. 2014 నుంచి బీఆర్‌ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకు రావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.అప్పట్లో ఐటీ- మంత్రిగా ఉన్న వ్యక్తి నగరానికి వచ్చే నీటిని నెత్తి విూద చల్లుకున్నాడు. ఆయన నీళ్ళు చల్లుకున్నంత మాత్రాన చేసిన పాపాలు ఎక్కడికి పోవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వివిధ ప్రాజెక్టుల నుంచి నగరానికి నీళ్లు తీసుకువచ్చారు. 2014 నుంచి ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మేము అధికారంలోకి వచ్చాక గోదావరి నీళ్ళని తీసుకురావడానికి ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్తున్నాం. ఒక వ్యక్తి తాడిచెట్టు- లాగా పెరిగాడు కానీ ఏమి లాభం లేదు. గోదావరి జలాలు కాళేశ్వరం నుండి వచ్చేవే కదా అంటున్నాడు. కానీ వాళ్ళు కట్టిన కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి విూ తాత ముత్తాతలు కట్టలేదు. గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం. కాకా సూచన మేరకు ప్రాణహిత చేవెళ్లకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుగా అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి నామకరణం చేశారు. చేవెళ్లలో రాజశేఖర్ రెడ్డి వేసిన శిలాఫలకం లేదా. కానీ దాన్ని ఆపి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు దగ్గర 152 విూటర్ల ఎత్తులో కడతాం అని అడిగాం. 149 విూటర్లకు ఒప్పుకున్నారు. గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. చేవెళ్ల, పరిగి, వికారాబాద్ కు నీళ్ళు తీసుకువస్తామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
వందరోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
` బాసర, మేడారం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
` అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి): మేడారం, బాసర ఆలయాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మేడారం అభివృద్ధి పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని, ఈ వారంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని అధికారులకు చెప్పారు. జాతరకల్లా సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ సోమవారం సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు అధికారులు వివరించారు. మేడారం అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ప్రవేశం, బయటకు వెళ్లే దారి, పార్కింగ్ తదితర ఏర్పాట్లు- ఉండాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా చెక్ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలి. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధిలో స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశంచేశారు. ఈ సవిూక్షలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహిళా ఆర్చర్ చికితకు సీఎం రేవంత్ అభినందన
` బంగారు పతకం సాధించేలా శిక్షణకు హామీ
హైదరాబాద్(జనంసాక్షి):మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చికిత తనిపర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా చికిత తనిపర్తి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో సీఎంను ఆమె కలిశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చికితకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల చైనాలోని షాంఘైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు- రజత పతకాన్ని ఆమె సాధించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, రాజేందర్ రావు తదితరులు చికిత వెంట ఉన్నారు.
అందుబాటులోకి కోకాపేట్ నియోపోలీస్ ట్రంపెట్
లంఛానంగా ప్రారంభించిన సిఎ రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):కోకాపేట వద్ద నియో పోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్‌ను సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ నిర్మించిన నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ట్రంపెట్‌ను నిర్మించారు. నియో పోలిస్ ప్రాంతంలో భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. దీంతో నియోపోలిస్, కోకాపేట ప్రాంతంలో భారీగా ఐటీ- కంపెనీలు తరలి రానున్నాయి. ఫ్యూచర్ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రంపెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ట్రంపెట్ జంక్షన్‌తో మోకిల, శంకర్‌పల్లి ప్రాంతాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.నియో పోలిస్ నుంచి ట్రంపెట్ ద్వారా 20 నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే నియోపోలిస్ నుంచి పైనాన్షియల్ డిస్టిక్ట్ర్, గచ్చిబౌలికి ఈజీగా కనెక్టివిటీ- ఉంటుందని పేర్కొంటు-న్నారు. ఓఆర్‌ఆర్‌కు కనెక్ట్ చేసేందుకు నియోపోలిస్ వద్ద ట్రంపెట్‌కి రెండు చోట్ల టోల్ గేట్స్ ఏర్పాటు చేశారు. ఈ నియో పోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితోపాటు- పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. కోకాపేట వద్ద నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్థానికులు కలిసి అభినందనలు తెలిపారు. దీంతో ఆయన వారికి అభివాదం తెలిపారు.
రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం ఇంటి కాంపౌండ్ కూల్చివేత
` అందరికీ ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి
మహబూబ్‌నగర్(జనంసాక్షి):తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం ఇంటి కాంపౌండ్‌ను అధికారులు కూల్చారు. ఇందుకు సీఎం అడ్డుచెప్పక పోగా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు ముఖ్యమంత్రి ఇంటి కాంపౌండ్‌ను కూల్చారు. ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తంను పడగొట్టారు. ఇందుకు సీఎం సహా ఆయన కుటు-ంబ సభ్యులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ విూడియా వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జనాలు రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ’సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శం’, ’సీఎం తల్చుకుంటే అక్కడ రోడ్డు వేయడాన్నే ఆపేవారు, కానీ ఆలా చేయలేదు’, ’ప్రజల శ్రేయస్సే సీఎం కోరుకున్నారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.