మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ఎదగాలి
గంభీరావుపేట సెప్టెంబర్ 10(జనంసాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లో మున్నూరు కాపు సభ్యత్వ నమోదు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు, ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన రాష్ట్ర మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రెటరీ కూర సురేష్ తెలంగాణలోని వంద సభ్యత్వాలు మొట్టమొదలుగా పూర్తి చేసి హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో అందజేశారు, రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షుడు మాట్లాడుతూ మొదటగా సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు, అన్ని సంఘాల తో మున్నూరు కాపులను ఏకతాటిపై తీసుకురావాలని, స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలని దానికి గాను కృషి చేయాలని తెలిపారు, మున్నూ రుకాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. మున్నూ రుకాపు హక్కుల సాధన కోసం కృషి చేస్తాననిమున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. మండల రాష్ట్ర జనాభాలో 24 శాతం ఉన్న మున్నూరుకాపు కులస్థులు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మగ్గుతున్నారని అన్నారు. బీసీల్లో అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి వేల కోట్ల రూపాయల ఆర్థికసాయం చేస్తుండగా మున్నూరుకాపులకు ఆర్థికసాయం లేదని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న మున్నూరు కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కాపులలందరినీ ఏకతాటిపై తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం పటేల్ తో పాటు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పద్మ పటేల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కూర సురేష్, గంభీరావుపేట ఆదర్శ మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు సిరిపురపు రవి, చత్రపతి శివాజీ మున్నూరు కాపు ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ పటేల్, వేషాల చిన్న రామచంద్రం పటేల్, పొట్టి వెంకటేష్ పటేల్, కమటం శ్రీలత, పటేల్, శైలజ పటేల్ కుల బాంధవులు పాల్గొన్నారు