ఈ నెల 6 నుంచి కొత్తరైళ్లు

సికింద్రాబాద్‌: ఈనెల ఆరు నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశ పెడుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపల్లి-హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు , ఆజ్మీర్‌-హైదరాబాద్‌ల మధ్య వారంలో ఒక సారి తిరిగే రైలు, తొమ్మిదవ తేదీనుంచి సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌ ట్రైవీక్లీ దురంతో రైలును ప్రవేశపెట్టనున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.